Sunday, March 29, 2026
E-PAPER
Homeకవితయుద్ధం

యుద్ధం

- Advertisement -

యుద్ధం ఎంత భయంకరమైనది!
ఎంతో విషాదకరమైనది కూడా!!
సరైన కారణం లేకుండానే యుద్ధం!!
అయోమయ స్థితిలో జనం, కుటుంబం మొత్తం ఒకేసారి అంతమైనా
కొందరు వికలాంగులై విలవిలలాడినా ఏదైనా బాధే కదా
కొత్తగా పెళ్లయిన దంపతులు, బుడిబుడి నడకల పసిపాపలు
ముద్దు ముద్దు మాటల చిన్నారులు, బోసి నవ్వుల అందాల బొమ్మలు
ఏం పాపం చేశారని అంత శిక్ష
యుద్ధం చేసే వారికైనా తామెందుకు చేస్తున్నామో తెలుసా?
కేవలం తమ అహంభావ సంతప్తికై
ప్రపంచ సార్వభౌమాధికారి అనిపించుకోవడానికై
ఇతర దేశాల ప్రజలనే కాదు
నీ దేశ పౌరుల కష్ట నష్టాలకూ కారణమవుతున్నావ్‌
వికత ఆటవిక చర్యలతో ఆనందపడుతున్నావ్‌
శాంతి అహింసలే మార్గమన్న బుద్ధుని బోధనలకు తిలోదకాలిచ్చి
పౌరుల భద్రతను ప్రశాంతతను భంగపరిచే ఏ ప్రభుత్వాలయినా శిక్షార్హులే
తాత్కాలిక విజయం చూసుకొని మురిసిపోకు
ప్రాణనష్టం ఆస్తుల విధ్వంసం ప్రకతి వినాశనం
నీ దేశంలో కూడా జరుగుతుందిగా నీవు ఏమి సాధించావని గర్వపడతావు?
మానవ వికాశం కొరకు చర్యలకు బదులుగా
మానవ వినాశనానికి మార్గం చూపుతున్నవ్‌
అన్నిటికన్నా విలువైనది ప్రాణమే కదా!!
ప్రాణాలు తీసి పుణ్యం అనుకుంటున్నావా?
అన్ని రోజులు అందరివీ కావు
బలవంతమైన సర్పమైనా చలి చీమల చేత జిక్కి చస్తుందొకరోజు
దేశాలన్నీ ఒక్కటై నీ పొగరును దించుతాయి
లిబియాలో కల్నల్‌ గడాఫీని ఇరాక్‌ లో సద్దాం హుస్సేన్‌ ను చంపి
వెనిజులాలో మధురోను కిడ్నాప్‌ చేసావ్‌
అసలు వేరే దేశ రాజకీయాల్లో నీ జోక్యం దేనికి? నీ ఆమోదం దేనికి?
చాలా దేశాలు బహిరంగ యుద్ధం చేయకున్నా
ఎంత తిట్టుకుంటున్నారో నీకు తెలుసా
అయినా మనిషివైతే కదా నీకు అర్థమయ్యేది
అలా అని ఏ జంతువుతోనూ నిన్ను పోల్చబుద్ధవడంలేదు
నీకు మద్దతు తెలిపే దేశాలకూ ప్రజల చేతిలో పరాభావం తప్పదు

నాగిరెడ్డి అరుణ జ్యోతి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -