Sunday, December 21, 2025
E-PAPER
Homeకవితయుద్ధ పింజరలు

యుద్ధ పింజరలు

- Advertisement -

అడుగంటిన చివరి ఏడుపుచుక్క
గులాబీ బుగ్గచివర
గుండ్రంగా నిల్చొని హెచ్చరిస్తున్నది
యుద్దోన్మాదుల్లారాజి
రేపు మీకోసంఒక్కదుఃఖపుచుక్కకూడా
రాల్చే కన్నుండదని
మీ శవాలు కాలడానికి
కట్టెలుకూడా ఒప్పకోవని
పూడ్చడానికి నేల ఒడి కూడా
నిరసన ఉమ్మేస్తుందని
మరీ మరీ హెచ్చరిస్తున్నది.
పిల్లల కలేజా రుచి మరిగినోళ్లారా
మీకోసం చరిత్రలో
నెట్త్తుటి పేజీయే గతి అని
మీ మీసైల్‌ మొఖాలు చూడనీకి
ఒక్కప్రాణికూడా అక్కడ నిలుచోదని
ఆగ్రహిస్తున్నది
తునకలైన తల్లుల శవాల ముందు
ఆ పసి కూనలు
ఆకలి ఏడుపును కలిపి అరుస్తున్నయి
పాలించే చేతకాని
పాలిచ్చే తల్లుల్ని,పిల్లల్ని
గడ్డి తినిపిస్తున్నరు
ప్రపంచ సంతలో
సత్తుగిన్నెతోఅడుక్కొమ్మంటున్నరు
మీ ఆధిపత్య మంటల్లో
కాల్చే హక్కు మీకెక్కడిదని
ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ
చూపులు మరణపు గడియని
చేరుతున్నయని
మీ మూర?పు బల పరీక్షలు
బతుకుల్ని పూడ్చేసు కున్నయని
మీ పేరేత్తడానికి
మాటలు కుడా మోండికేస్తున్నయి
యుద్దపింజరలంటే
ఇప్పుడే చూస్తున్నము
మీ తడిలేని కొంచెమైనా దయలేని
గుండెలంటే మీరేనని రుజువైందని
మరీ మరీ చెప్తూ వెళ్లి పోతున్నారు వాళ్ళు
అలసిన కండ్లతో ఏడుపంటిన చేతులతో
వెళ్లి పోతున్నారు వాళ్ళు వెళ్లి పోతున్నారు.

డా. ఉదారి నారాయణ, 9441413666

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -