అమెరికా విమానాల మోహరింపు
ఈయూపై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్
వాషింగ్టన్ : గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకు నేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. గ్రీన్‌లాండ్ లోని కీలక సైనిక స్థావరానికి యుద్ధ విమానాల ను తరలించాలని నిర్ణయించారు. పిటుఫిక్ స్పేస్ బేస్‌కు త్వరలోనే విమానాలు చేరుకుంటా యని ఉత్తర అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ తెలిపింది. ఆర్కిటిక్ ప్రాంతంలో రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు వీటిని మోహరి స్తున్నట్టు చెప్పింది. అమెరికా, కెనడా దేశాల లోని స్థావరాల నుంచి పనిచేయడంతో పాటు కమాండ్ కార్యకలాపాలకు అవి మద్దతు ఇస్తాయని వివరించింది. కెనడా, డెన్మార్క్‌లతో రక్షణ సహకారానికి అవి ఉపకరిస్తాయని తెలిపింది. యుద్ధ విమానాల మోహరింపుపై గ్రీన్‌లాండ్‌కు ముందుగానే సమాచారం ఇచ్చామని కమాండ్ చెప్పింది. బల ప్రయోగంతో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘నో కామెంట్’ అని ట్రంప్ బదులిచ్చారు. అయితే గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోని పక్షంలో యూరోపియన్ దేశాలపై సుంకాలతో విరుచుకుపడతానని తేల్చి చెప్పారు. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాలలో గ్రీన్‌లాండ్ అంశాన్ని లేవనెత్తాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆ దీవిని కొనుగోలు చేసే విషయంపై దావోస్‌లో చర్చిస్తానని ఆయన చెప్పారు. గ్రీన్‌లాండ్‌ను రక్షించే సత్తా డెన్మార్క్‌కు లేనందున దానిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు.
గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు
యుద్ధ విమానాలు ఎప్పుడు గ్రీన్‌లాండ్‌కు చేరుకుంటాయనే విషయంపై కమాండ్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గ్రీన్‌లాండ్ విషయంలో యూరోపియన్ భాగస్వాములపై అమెరికా ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకరించని పక్షంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి డెన్మార్క్, నార్వే, స్వీడన్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలపై యూరప్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదని యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలు రాబర్టా మెట్సోలా స్పష్టం చేశారు. డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రజలకు యూరప్ బాసటగా నిలుస్తుందని, గ్రీన్‌లాండ్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉన్నదని ఆమె చెప్పారు.
గ్రీన్‌లాండ్‌కు డెన్మార్క్ దళాలు
ఇదిలావుండగా డెన్మార్క్ కూడా గ్రీన్‌లాండ్‌కు పెద్ద ఎత్తున అదనపు దళాలను తరలిస్తోంది. డెన్మార్క్ సైనిక వాహనాలు సోమవారం భారీ సంఖ్యలో గ్రీన్‌లాండ్ వైపు ప్రయాణించాయి. గ్రీన్‌లాండ్‌లో నిఘా కార్యకలాపాలు ప్రారంభించాలని నాటోను డెన్మార్క్ కోరింది. కాగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా బల ప్రయోగానికి దిగుతుందన్న భయాందోళనలను ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తోసిపుచ్చారు.
గ్రీన్‌లాండ్‌లో యుద్ధ మేఘాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



