నవతెలంగాణ బిజినెస్ : బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చాయి. ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ దాడుల అనంతరం అమాంతం వీటి రేట్లు పెరిగాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. పెట్టుబడుల భద్రత కోసం పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మార్కెట్ అస్థిరంగా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గత వారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఏకంగా 9,430 రూపాయల మేర ప్రియం కాగా, 22 క్యారెట్ల బంగారం ధరలో 8,550 రూపాయల పెరుగుదల నమోదైంది. వీటి రేట్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. వారం ముగిసేసరికి రికార్డు స్థాయికి చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయి. రూ. 1,75,000 నుండి 1,80,000 రూపాయల వరకు వెళ్లొచ్చు. మల్టీ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3.15 శాతం పెరిగింది. ప్రారంభ ట్రేడింగ్ లో రాకెట్ లా దూసుకెళ్లింది ఏకంగా 1,67,217 రూపాయలకు చేరింది. ఆ తర్వాత ఇది ఎక్కడా ఆగలేదు.
వార్ ఎఫెక్ట్ బంగారం, వెండి స్కై రాకెట్
- Advertisement -
- Advertisement -



