Tuesday, March 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవార్ ఎఫెక్ట్..భార‌త్‌లోనే వెస్ట్ండీస్, జింబాబ్వే టీంలు

వార్ ఎఫెక్ట్..భార‌త్‌లోనే వెస్ట్ండీస్, జింబాబ్వే టీంలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ‌కాంక్ష‌ల‌తో ఇరాన్‌పై దండెత్తిన విష‌యం తెలిసిందే. మూడు దేశాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర‌ దాడుల‌తో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్నాయి. దీంతో ప‌శ్చిమాసియా ఉప‌రిత‌లంలో విమాన రాక‌పోక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఆయా దేశాల్లోని యాత్రికులు ఎయిర్‌పోర్టు లో చిక్కుకుపోయారు. గంట‌ల త‌ర‌బ‌డి ఎయిర్‌పోర్టులో ప‌ర్యాట‌కులు ప‌డిగాపులు కాస్తున్నారు. తాజాగా పశ్చిమాసియాలో నెల‌కొన్న‌ యుద్ధం సెగ భార‌త్-శ్రీ‌లంక సంయుక్త ఆతిథ్యంగా కొన‌సాగుతున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జట్ల‌కు తాకింది.

ఈ మెగా టోర్నీలో సూపర్‌-8 దశలో నిష్క్రమించిన వెస్టిండీస్‌, జింబాబ్వే టీంలు.. అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్ పరిమితుల కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోయింది. ఇరు టీంలు స్వదేశానికి చేరాలంటే దుబాయ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంది. వీలైనంత త్వరగా తమ జట్టును స్వదేశానికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ విషయంలో విండీస్‌ బోర్డుకు ఐసీసీ, బీసీసీఐ సహకరిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మెగా టోర్నీలో తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -