యుద్ధం

యుద్ధం కొన్ని తరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల వేల జీవితాలు తలకిందులవుతాయి. వేల సంఖ్యలో అమాయక ప్రజలు నిరాశ్రయులవుతారు. అభం శుభం తెలియని పసిపిల్లలు అనాథలవుతారు. గాజాలో జరిగిన దారుణాలు ఇంకా మన కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని స్థితిలో చిన్నారులు అల్లాడుతుంటారు. భర్తను కోల్పోయి కొందరు.. భార్యను కోల్పోయి మరికొందరు.. తల్లిదండ్రులను కోల్పోయి ఇంకొందరి అందమైన జీవితాల్లో అంధకారం అలుముకుంటుంది. ఇలాంటి అభాగ్యులకు ఎంత సాయం చేసినా వారి కుటుంబీకులను అందివ్వలేరు. ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధాన్ని చూసినా ఎన్నో హదయ విదారక సంఘటనలు, సంఘర్షణలు వెలుగు చూస్తాయి.
అన్నం, మందులు కావాలంటే యుద్ధం చేస్తున్నారు ఎందుకనీ? ప్రపంచ ప్రజలంతా శాంతి కోరుతుంటే యుద్ధం చేస్తున్నారు ఎందుకనీ? యుద్ధం వల్ల ఒక వ్యక్తిపై ఆధిపత్యం సాధించవచ్చు. ఒక ప్రాంతం మీద పెత్తనం చెలాయించవచ్చు. ఒక దేశాన్ని శాసించవచ్చు. కానీ దాని వెనుక జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని భర్తీ చేయలేం. మొదటి ప్రపంచ యుద్ధం నుండి కండ్లకు కనిపిస్తున్న వాస్తవాలివి. అందుకే యుద్ధం గెలిచినవాడి కంటే యుద్ధాన్ని ఆపినవాడు గొప్పవాడు. తాను చేసిన యుద్ధంలో జరిగిన విధ్వంశాన్ని చూసి చలించి పోయిన అశోక చక్రవర్తి ‘ఇక నేను యుద్ధం చేయను’ అని ప్రతిన బూనుతాడు. ఆధిపత్యం, అధికారానికై యుద్ధం తప్ప మరో మార్గం లేదని భావించే ఆ రోజుల్లోనే ఓ రాజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే నేటి ప్రజాస్వామ్య యుగంలో యుద్ధానికి కాలుదువ్వుతున్న దేశాలు, వాటిని ప్రోత్సహిస్తున్న వారు ఇంకెంత ఉన్నంతగా ఆలోచించాల్సి వుంటుంది. కానీ అలాంటి ధోరణి మచ్చుకైనా కనిపించడం లేదు.
యుద్ధం కొన్ని తరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల వేల జీవితాలు తలకిందులవుతాయి. వేల సంఖ్యలో అమాయక ప్రజలు నిరాశ్రయులవుతారు. అభం శుభం తెలియని పసిపిల్లలు అనాథలవుతారు. గాజాలో జరిగిన దారుణాలు ఇంకా మన కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని స్థితిలో చిన్నారులు అల్లాడుతుంటారు. భర్తను కోల్పోయి కొందరు.. భార్యను కోల్పోయి మరికొందరు.. తల్లిదండ్రులను కోల్పోయి ఇంకొందరి అందమైన జీవితాల్లో అంధకారం అలుముకుంటుంది. ఇలాంటి అభాగ్యులకు ఎంత సాయం చేసినా వారి కుటుంబీకులను అందివ్వలేరు. ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధాన్ని చూసినా ఎన్నో హదయ విదారక సంఘటనలు, సంఘర్షణలు వెలుగు చూస్తాయి. ఈ నెల 20వ తేదీన రఫాలో జరిగిన సంఘటనలో 17 మంది చిన్నారులు ఇజ్రాయెల్‌ బాంబులకు బలైపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరింత విషాదం. ఈ దారుణంలో ఇద్దరు మహిళలూ ప్రాణాలు కోల్పోయారు.
ఏడు నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో ఇలాంటి విషాదకర దృశ్యాలెన్నో. ఈ యుద్ధానికి నిరసనగా అమెరికాలో విద్యార్థులు నిరసనలు తెలుపుతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఏ రెండు దేశాల మధ్యనైనా సున్నితమైన అంశాలే యుద్ధానికి దారితీస్తాయి. అలాంటి అంశాలపై ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. యుద్ధానికి దారితీసే సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రయత్నించాలి. మిత్ర దేశాల సలహాలు, సూచనలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ పరిస్థితులను నివారించాలి. యుద్ధాన్ని ఆపడం వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చు. లక్షలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. ఆయా దేశాల ప్రజలకు శాంతిని, స్వేచ్ఛను పంచవచ్చు. ప్రపంచ దేశాలు చొరవ తీసుకుని యుద్ధం ఆపి శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక మంది అమాయక ప్రజల జీవితాలను కాపాడుకోవాలి.
అభివద్ధి, ఆధిపత్యం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏదో ఒకచోట యుద్ధం జరుగుతూనే ఉంది. వేలమంది అనాథలవుతున్నారు. వారికి చేయూతను అందించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంటుంది. వారికి రక్షణ, ఉపాధి, విద్య, వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరుదేశాల నడుమ శాంతి నెలకొని మరింత మంది అనాథలు కాకుండా నిలువరిద్దాం.

Spread the love