నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన స్థానాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు గురువారం సందర్శించారు. వరంగల్ స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధిపై విజ్ఞాన యాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేక్కొండ, కేసముద్రం, చింతపల్లి, ఒడిస్సా నుండి 40 మంది రైతులు పసుపు పరిశోధన స్థానాన్ని సందర్శించారు.
పరిశోధన స్థానంలోని పసుపు రకాలు, యంత్రాలు, పరిశోధనలను రైతులు పరిశీలించారు. పసుపు పరిశోధన కేంద్రం సందర్శనకు విచ్చేసిన రైతులకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పసుపు పంటలు, మెళుకువలు వివరించారు. వాల్యూ ఎడిషన్ గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం రైతులు పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేసే సాగు చేస్తున్న వివిధ నూతన పసుపు వంగడాలను, పసుపు సాగు కోసం వినియోగించే నూతన యంత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీనివాస్, పరిశోధన కేంద్రం సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



