- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ ఎన్నికల్లో సందర్భంగా మాట ఇచ్చినట్లుగానే 8 వార్డ్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన మామిడిపల్లి ఈద్గా మరమ్మత్తుల పని కోసం శనివారం రంజాన్ సందర్భంగా 8 వార్డ్ కౌన్సిలర్ డిచ్ పల్లి శ్రీ శారదా దినేష్ తన సొంత డబ్బులు మూడు లక్షల రూపాయలు మజీద్ కమిటీ వారికి నమాజ్ అనంతరం కమిటీ పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శారదా దినేష్ ను కమిటీ పెద్దలు సన్మానించి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు ముస్లిం కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



