Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజకీయ నాయకుల సమక్షంలో వార్డ్ మెంబర్ల రిజర్వేషన్ల ఖరారు..

రాజకీయ నాయకుల సమక్షంలో వార్డ్ మెంబర్ల రిజర్వేషన్ల ఖరారు..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శనివారం ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయంలో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు, తహసిల్దార్ వెంకట్ రావు, మండల ప్రత్యేక అధికారి, ఇన్చార్జి ఎంపిఓ పాండు మండలంలోని ఆయా గ్రామాలలో వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. మండలంలోని 23 గ్రామాలలోని అన్ని గ్రామాలలో  వార్డు మెంబర్ల లో మహిళలకు 50 శాతం బీసీలకు 42 శాతం తగ్గకుండా రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్న రెడ్డి సంతోష్ రెడ్డి, బిఆర్ఎస్ నుండి తిర్మన్ పల్లి మాజీ ఎంపీటీసీ చింతల దాస్, బిజెపి నుండి శ్రావణ్ తో పటు డిసిసి డెలిగేట్ టి సుధాకర్ మోహన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -