Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు సభ్యులకు పంచాయితీరాజ్ చట్టాలు తెలిసుండాలి

వార్డు సభ్యులకు పంచాయితీరాజ్ చట్టాలు తెలిసుండాలి

- Advertisement -

– ట్రైనర్ సీనియర్ సెక్రెటరీ లు నాగయ్య. అశోక్ గౌడ్..
నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండలంలోని 11 గ్రామపంచాయతీల్లో ఉన్న వార్డు సభ్యులకు మొదటి విడత శిక్షణా తరగతులకు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి 84 మంది వార్డు సభ్యులు హాజరయ్యారని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులు నిర్వహణ గురించి ట్రైనర్లను ఎంపీడీవో, ఎంపీవో లను అడిగి తెలుసుకున్నారు.

అనంతంరం ట్రైనర్స్ అశోక్ గౌడ్, నాగయ్య మాట్లాడుతూ.. గ్రామాలలోని వార్డు సభ్యులు గ్రామపంచాయతీ చట్టాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్నప్పుడే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలుగుతామని అన్నారు. వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంతోపాటు గ్రామపంచాయతీల విధులు, బాధ్యతలు,  సర్పంచ్ , ఉప సర్పంచ్ ల బాధ్యతలు తెలిసి ఉండాలని ఉద్దేశంతో శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -