-వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమం విజయవంతం
నవతెలంగాణ – రాయికల్
మండల పరిషత్ కార్యాలయంలో గత ఐదు రోజులుగా నిర్వహించిన రెండో బ్యాచ్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.18 గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి రాయికల్ ఎంపీవో సుష్మా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు సభ్యులు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను సమయానుకూలంగా గుర్తించి పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. శిక్షకులు దేవదాస్ మాట్లాడుతూ..వార్డు సభ్యుల బాధ్యతలు, త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణలో వారి పాత్రను వివరించారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఐదు రోజుల శిక్షణ ద్వారా నిధుల సమర్థ వినియోగం, ప్రజల జీవన నాణ్యత పెంపు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసే విధానాలపై స్పష్టత లభించిందని భూపతిపూర్ వార్డు సభ్యురాలు మగ్గిడి సంధ్య తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సహా శిక్షకులు కృష్ణ చైతన్య, తిరుపతి, నరేష్ పాల్గొన్నారు.
వార్డు సభ్యులు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి: ఎంపీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



