Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వంట పాత్రలను శుభ్రంగా కడగాలి

వంట పాత్రలను శుభ్రంగా కడగాలి

- Advertisement -

– కోన సముందర్ సర్పంచ్ బెజ్జారపు రాకేష్
– మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసే ముందు వంట పాత్రలను శుభ్రంగా కడగాలని సర్పంచ్ బెజ్జారపు రాకేష్ అన్నారు. శనివారం మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను సర్పంచ్ రాకేష్ తనిఖీ చేశారు. శుభ్రమైన వాతావరణంలో కలుషితం కాకుండా మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేయాలని నిర్వహకులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలన్నారు.  

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం పూర్తయిన తర్వాత వంట పాత్రలను శుభ్రంగా కడిగి ఉంచాలని, వంట చేసే ముందు మరోసారి వాటిని శుభ్రంగా కడగాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం అందిస్తున్న తీరును, నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,  పాఠశాల ఇంచార్జి  ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నర్సయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు బాట్ల లత, నజర్నేబేగం, జ్యోతి, నందిని, రాఘవి, లక్ష్మి, బుచ్చక్క, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -