Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొట్టుకుపోయిన ధాన్యం

కొట్టుకుపోయిన ధాన్యం

- Advertisement -

– రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అకాల వర్షం
– ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కల్లాల్లో భారీ నష్టం
నవతెలంగాణ – విలేకరుల బృందం

రెండు మూడ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా భారీ నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యం, పత్తి తడిసి ముద్దవుతోంది. ధాన్యం కాంటాలు పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో శనివారం కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధాన్యం కొట్టుకుపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు.కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలోని మొడేగాం గ్రామానికి చెందిన భోయిని సాయిలు వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో వరి ధాన్యం తడవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలో కురిసిన వర్షం కారణంగా రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. నిజామాబాద్‌ జిల్ల చందూర్‌ మండల కేంద్రంతోపాటు లక్ష్మపూర్‌, మేడిపల్లి, లక్ష్మిసాగర్‌ గ్రామాల్లో, రెంజల్‌ మండల కేంద్రంలో, ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం తడిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -