మమ్దానీకి ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ : న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీకి సాయపడేందుకు సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే తన బాధ్యతల నిర్వహణలో విజయం సాధించాలంటే ఆయన వాషింగ్టన్‌ను గౌరవించక తప్పదని హెచ్చరించారు. అవసరమైతే ట్రంప్‌తో పోరాడేందుకు సిద్ధమేనంటూ మమ్దానీ చేసిన వ్యాఖ్యను ‘ప్రమాదకరమైన ప్రకటన’గా అభివర్ణించారు. ‘ఆయనకు వాషింగ్టన్ అంటే పెద్దగా గౌరవం లేదు. ఆయన వాషింగ్టన్‌ను గౌరవించని పక్షంలో బాధ్యతల నిర్వహణలో విజయం సాధించలేరు’ అని ఫాక్స్ న్యూస్ ప్రతినిధి బ్రెట్ బయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఆయన విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను.
న్యూయార్క్ నగరం కూడా బాగుండాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు. ఆ వెంటనే మాట మార్చి తాను న్యూయార్క్ నగరం బాగుండాలని కోరుకుంటున్నానే తప్ప మమ్దానీ విజయం సాధించాలని కాదని అన్నారు. ‘కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, గ్లోబలిస్టులకు అవకాశం వచ్చినప్పుడు వారు చేసిందేమీ లేదు. విధ్వంసం తప్ప. ఇప్పుడు న్యూయార్క్‌లో కమ్యూనిస్టు ఏం చేస్తాడో చూడాలి’ అంటూ మరోసారి కమ్యూనిస్టులపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. మమ్దానీకి కొంత మేర సాయం చేస్తామని, న్యూయార్క్ నగరం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామని చెప్పారు. కాగా ట్రంప్‌పై మాటల యుద్ధం చేయబోనని మమ్దానీ చెప్పారు. ఆయనతో చర్చలకు సిద్ధమేనని అన్నారు.
వాషింగ్టన్‌ను గౌరవించాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



