Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నష్టం జరిగిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకొని వాచ్మెన్ ఉద్యోగాలు ఇవ్వాలి

నష్టం జరిగిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకొని వాచ్మెన్ ఉద్యోగాలు ఇవ్వాలి

- Advertisement -

ఎన్పీడీసీఎల్  డిచిపల్లి ఏడికి వినతి
నవతెలంగాణ- కంఠేశ్వర్
నష్టం జరిగిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకొని వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య కోరారు. సోమవారం ఎన్పీడీసీఎల్ డిచ్పల్లి ఏడికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరాంకుశం గోపికి డిచ్ పల్లిలో ఎలక్ట్రికల్ పోల్ ఎక్కి పనిచేసే క్రమంలో విధ్యుత్ లైన్ 11కెవి లైన్ షాక్ తగిలి కిందపడటం జరిగింది. వెంటనే నిజామాబాద్ ప్రగతి హాస్పిటల్ బాదితున్ని తరలించారు. అయితే అప్పటికి ఆయన పరిస్థితి విషమించిందని, డాక్టర్స్ సిఫార్సు మేరకు హైదరాబాద్ తీసుకువెళ్ళటం జరిగింది అని తెలియజేశారు.

ఈ క్రమంలో హైదరాబాద్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చెయ్యటం జరిగింది. అయితే అతనికి కాలు, చెయి ఇన్ఫెక్షన్ కావటం వాళ్ళ అక్కడ డాక్టర్స్ కాలు చేతు తీసివేయటం జరిగింది. విధ్యుత్ లైన్మాన్ నెగ్లాట్ వాళ్ళ 11 లైన్ రాంగ్ ఎల్ సి ఇవ్వటం వలన ఇలాంటి సంఘటన జరిగింది. కావున కాంట్రాక్టర్స్ డైలీ వైజ్ పనిచేసే కార్మికుడికి ఇన్సూరెన్స్ లేదు. పిఎఫ్, ఈఎస్ఐ,  లేదు. కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం వాళ్ళ ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నారు. కావున కార్మికులకు కాంట్రాక్టర్స్ పిఎఫ్, ఈఎస్ఐ  ఇన్సూరెన్స్లు చేయాలని,  నష్టం జరిగిన కుటుంబాలకు విధ్యుత్ అధికారులు వాచ్మాన్ ఉద్యోగాలు ఇవ్వాలని సిఐటియు యూనియన్ జిల్లా కమిటి సభ్యులు నాల్వల నర్సయ్య కోరారు. కార్ముకులందరూ ఇకనుండి ఐక్యత కలిగి ఉండాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -