Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చెరువులకు జలకళ

చెరువులకు జలకళ

- Advertisement -
  • – రరవళ్ళు తొక్కుతున్న చలివాగు
    – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
    – ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
    నవతెలంగాణ -పరకాల 
  • గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులకు జలకళ సంతరించుకుంది. పరకాల మండలంలోని పరకాల పెద్ద చెరువుకు సుమారు ఏడు ఫీట్ల నీరు చేరుకుంది. వెలంపల్లి, మలకపేట, పైడిపెల్లి‌ చెరువులకు భారీగా వరధ నీరు వచ్చి చేరుతుండడంతో పంటలకు సాగునీటి కొరత తీరుతుందని రైతులు, గ్రామస్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    • పరకాల పట్టణాన్ని ఆనుకొని ప్రవహించే చలివాగు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పరవాళ్ళు తొక్కుతోంది. ఈ క్రమంలో ఏసిపి సతీష్ బాబు, సిఐ క్రాంతి కుమార్ చలి వాగు 

వద్దకు చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.వాగు ప్రవాహం ఉదృతంగా ఉన్నందున ఒకటి రెండు రోజులు వేటను మానుకోవాలంటూ సూచించారు. అంతేకాకుండా వర్షాల కారణంగా ప్రజలు ప్రమాదపారిన పడకుండా ఉండడం కోసం శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదన్నారు, విద్యుత్ స్తంభాలు, జలాశయాల దగ్గరికి వెళ్లకూడదన్నారు, పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలంటూ సూచించారు.
పరకాల పట్టణంలో వర్ష ప్రభావం:  గత రెండు రోజుల కురుస్తున్న వర్షానికి  పరకాల పట్టణంలో తీవ్ర పారిశుద్ధ్య సమస్య తలెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. కాలీ ప్లాట్లలో నీట నిలువలు పేరుకుపోయాయి. దీంతో దోమలు ఈగలు ఉధృతి చెందే అవకాశాలు ఉన్నాయంటూ పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైనజీ వ్యవస్థ లేకపోవడంతో పరకాల పట్టణంలోని పరకాల భూపాలపల్లి జాతీయ రహదారిపై భారీగా నీరు నిలవడంతో చెరువును తలపిస్తోంది. మమత నగర్ లోని కొన్ని గృహాలలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ వివరణ కోరగా మొత్తం పరిస్థితిని అంచనా వేసి ఉదయం నుంచి పట్టణంలో నాలుగు వాహనాల ద్వారా అన్ని వార్డులలో పారిశుధ్య సమస్యకు సంబంధించిన ఏర్పాట్లను పరిష్కరించడం జరుగుతుందన్నారు. లోతట్టు ప్రాంతాలలో, ప్రైవేట్ ప్లాట్ లలో చేరిన నీటి నిలువలను అందుబాటులో ఉన్న డ్రైనేజీ కాలువలలోకి దారి మళ్ళించి క్లియర్ చేస్తున్నామన్నారు.
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి 
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు, అంతేకాకుండా ప్రజలు వాగులు,చెరువుల దగ్గరికి వెళ్ళొద్దని కోరారు. పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు ‌ విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దన్నారు.వర్షాల కారణంగా రోడ్లు మునిగిపోవడం, మురుగునీరు ఉప్పోంగడం, వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని,అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దన్నారు.
ఇంటింటికి తిరిగి ప్రజలను అప్రమత్తం చేసిన మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్
గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణంలోని ఒకటవ వార్డ్ మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఒకటో వార్డులోని రజక వాడ, సీఎస్ఐ కాలనీ, ఎస్సీ కాలనీలోని కొత్తవాడలో పర్యటించి ప్రజలకు వర్షం వలన ఎదురయ్య ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పాత ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెరువులు వాగుల వద్దకు వెళ్ళవద్దని, విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదం ఏర్పడుతుందని వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని వాడు ప్రజలకు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad