- బంజారా సింగారం బొజ్జన్నపేట గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు
- మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
- మూల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడు గ్రామంలోని పయ్యాల వెంకన్న ఇంటి మదు సుమారు 100 మీటర్ల దూరంతో మోకాళ్ళ లోతుతో నీరు నిలువ ఉందని దీంతో రాకపోకలకు ఎంతో ఇబ్బందులు ఉన్నాయని వెంటనే వాటిని తొలగించాలని బొజ్జన్నపేట బంజర సింగారం గ్రామస్తులు మూల శ్రీనివాస్ రెడ్డి గాడి పెళ్లి శ్రీను గాడి పెళ్లి వీరన్న నాగవెల్లి ముఖేష్ మడిపేది లక్ష్మణ్ నలమాస మల్లయ్య మెరుగు యాకయ్య మీరుగు కృష్ణ మెరుగు వెంకన్న శ్రీను ఎంపీడీవో కుమారును కోరినట్లు తెలిపారు.

సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ చాంబర్లో ఆయనతో సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిగలవీడు గ్రామానికి బంజారా సింగారం బొజ్జన్నపేట గ్రామ ప్రజలు రాకపోకలకు మునిగలవీడు గ్రామంలో మెయిన్ రోడ్డుపై నీటి నిల్వలు రెండు మూడు రోజుల నుండి ఉన్నప్పటికీ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంలేదని తన దృష్టికి తీసుకెళ్లిన కూడా పరిష్కారం లేదని అందుకోసమే ఎంపీడీవో కుమార్ దృష్టికి తీసుకొస్తున్నామని అన్నారు. మునిగిలవిడు హై స్కూల్ కి ఇతర గ్రామాల ప్రజలు పిల్లలు దారి పై రావడానికి రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈరోజు ఆ నీళ్లలో కొంతమంది ప్రయాణికులు బాటసారిలు నీరు నిలువ ఎక్కువ ఉండడంతో పూర్తిస్థాయిలో నడవరాక అందులోనే కులబడిపోయారని అన్నారు.
దీంతో వారి ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చెందారు. రైతులు మందు బస్తాలు తీసుకురావడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు పొలాల కు చిలకలకు వెళ్లేందుకు కూలీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని అధికారులను కోరుతున్నామని తెలిపారు.
ఈ గ్రామానికి చుట్టు గ్రామాల ప్రజలు రావడానికి ఈ గ్రామానికి వస్తూపోతుంటారు పాఠశాలకు దుకాణాలకు పెన్షన్ కోసం ఇతర పనుల నిమిత్తం రోజు అనేకమంది వచ్చి పోతారని అన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని ఎంపీడీవో కుమార్ హామీ ఇచ్చి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సింగారం బొజ్జన్నపేట గ్రామస్తులు పాల్గొన్నారు.