Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమరమ్మతుల దృష్ట్యా సింగూరు ప్రాజెక్టు నీటి విడుదల

మరమ్మతుల దృష్ట్యా సింగూరు ప్రాజెక్టు నీటి విడుదల

- Advertisement -

రోజుకు 2.336 క్యూసెక్కులు..
40 రోజుల్లో 8 టీఎంసీల నీరు దిగువకు


నవతెలంగాణ-పుల్కల్‌
మరమ్మతుల దృష్యా సింగూరు ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌ నుంచి పవర్‌ హౌస్‌ ద్వారా నీటిని శనివారం అధికారులు దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఎస్‌జెన్కో ఏఈ రాజు, నీటిపారుదల అధికారులు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలోని సింగూర్‌ ప్రాజెక్ట్‌లో మరమ్మతులు చేసేందుకు ప్రాజెక్టులోని నీటిని సగానికి తగ్గించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో దిగువకు నీటిని వదులుతున్నట్టు చెప్పారు.

ప్రాజెక్టులో ప్రస్తుతం 16.395టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఈ నీటిని రోజుకు 2.336 క్యూసెక్కుల నీరు చొప్పున 40 రోజుల్లో 8 టీఎంసీల నీటిని పవర్‌హౌస్‌ ద్వారా విడుదల చేస్తారు. దాంతో ప్రాజెక్టులో నీరు సగానికి పడిపోతుంది. పవర్‌ హౌస్‌ రెండు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. దీనివల్ల రోజుకు సుమారు 0.288 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నట్టు తెలిపారు. 40 రోజుల్లో సుమారు 11 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానున్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -