Monday, November 24, 2025
E-PAPER
Homeఖమ్మంఉన్నత పాఠశాలకు జల భగీదారీ అవార్డు

ఉన్నత పాఠశాలకు జల భగీదారీ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జల సంచయ్ జన్ భగీదారీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు జల సంరక్షణ కోసం పాఠశాల ఆవరణలో అధిక సంఖ్యలో ఇంకుడు గుంతలను నిర్మించి భూగర్భ జల రీచార్జ్ ను పెంపొందించేందుకు కృషి చేసినందుకు గాను ప్రధానోపాధ్యాయురాలు హరిత ను ప్రశంసిస్తూ జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అవార్డ్ ను అందించారు.

కలక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందించారు. పాఠశాల ఆవరణలో వృధా నీరు భూమిలో ఇంకేం దుకు గాను 6 ఇంకుడు గుంతలను నిర్మించి పాఠశాలల్లో అత్యధిక ఇంకుడు గుంతలను నిర్మించిన పాఠశాలగా గుర్తింపు పొందినందుకు ఈ అవార్డ్ లభించింది. ఈ పాఠశాలకు అవార్డు రావడం పట్ల అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ,ఎం ఇ ఓ ప్రసాదరావు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -