పంట పొలాల నుంచి నీటిని తెచ్చుకున్న గ్రామస్తులు
వాటర్ ట్యాంక్ ఉన్నా కనెక్షన్లు లేవు
కామారెడ్డి జిల్లా అక్కంపల్లి గ్రామంలో ఘటన
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం అక్కంపల్లి గ్రామంలో గురువారం పండగపూట గ్రామస్తులు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉంది. దానికి సంబంధించి రెండు బోర్లూ ఉన్నాయి. ఒక బోర్ మోటార్ కాలిపోయింది. ఇంకో బోర్ మోటార్‌కు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో ట్యాంక్‌లోకి నీరు రాలేదు. మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న నీరు రంగు మారి రావడంతో పండుగ పూట గ్రామస్తులకు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు గ్రామస్తులకు కావాల్సిన సదుపాయాలు కల్పించకపోవడంతో పంట పొలాల నుంచి నీరు తెచ్చుకొని పండగ జరుపుకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు తెలిపారు. తరచూ గ్రామంలో నీటి సమస్య ఏర్పడుతుందని శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు.
పండగపూట నీటి తిప్పలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES