Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాటర్ ట్యాంక్ శుభ్రపరిచి క్లోరినైజేషన్

వాటర్ ట్యాంక్ శుభ్రపరిచి క్లోరినైజేషన్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామపంచాయతీ పరిధిలోని వాటర్ ట్యాంక్‌ను సోమవారం రోజు పూర్తిస్థాయిలో శుభ్రపరిచి,కడిగి,క్లోరినైజేషన్ చేయడం జరిగింది.గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వల్ల శోభన్ బాబు పాల్గొనగా,వార్డు సభ్యులు చౌడబోయిన లావణ్య రవి, చౌడబోయిన ఆంజనేయులు, పోతారం కనకయ్య,చౌడబోయిన సతీష్, పరుశరాములు ఆంజనేయులు, కొత్తపల్లి పోచయ్య పాల్గొన్నారు. అలాగే వాటర్ మెన్ మల్లం సంజీవులు,దండు రవి,పారుపల్లి నరసయ్యతో పాటు మిషన్ భగీరథ ఆపరేటర్ మెరుగు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గ్రామంలో నీటి నాణ్యతను కాపాడేందుకు ఇలాంటి చర్యలు నిరంతరం చేపడతామని గ్రామ సర్పంచ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -