– పట్టించుకోని గ్రామపంచాయతీ కార్యదర్శి..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామపంచాయతీ గ్రామంలో వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో లీకేజీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. చుక్కనీరు ఒడిసి పట్టాలని అధికారుల ద్యాస గాలికి వదిలేశారు. ఎప్పుడు వాటర్ ట్యాంక్ లీకేజీ వారు నిత్యం కొనసాగుతూ వస్తుంది. వాటర్ ట్యాంక్ పక్క రోడ్డు ఉంది. నిత్యం మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులు రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. ద ఆ దారి గుండా వెళ్లే వారికి ట్యాంక్ నుండి వాటర్ ఓవర్ ఫ్లో లీకేజీ ముందు దర్శనం అవుతుంది. అయినా నీటి ఓవర్ ఫ్లో లీకేజీ అవుతున్న పట్టించుకోకపోవడం వారి అవివేకానికి పరాకాష్టగా మారుతుంది. చుక్క చుక్క నీటిని ఒడిసి పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వృధా చేయకుండా రాబోయే ముందు తరాల వారికి ఉపయోగించుకోవడం కోసం ఆదా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఏమీ ఎరగనట్టు ఉండడం జరుగుతుంది. ప్రతినిత్యం ట్యాంక్ ఓవర్ ఫ్లో లీకేజీతో వాటర్ ట్యాంకు ఉన్న ప్రాంతమంతా పిచ్చి మొక్కలతో గడ్డి పెరిగిపోయింది. పక్కన నివాసం ఉంటున్న గృహాల వాసులకు దుర్గంధం వెదజల్లుతూ ప్రాంతమంతా బురదమయంగా మారింది.
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో పేద ప్రజలకు అధికారులు అల్లర్టుగా ఉండాలని జిల్లా పాలన అధికారి అధికారులకు హెచ్చరించిప్పటికీ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ప్రజల అనారోగ్యానికి పరోక్షంగా సహకరించినట్టు కనిపిస్తోంది. గ్రామంలోని పేద ప్రజలు వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తీస్తున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జీపి అధికారులు బాధ్యత వహించి వెంటనే వాటర్ ఓవర్ ఫ్లో లీకేజీని అరికట్టాలని, ఓవర్ ఫ్లో లీకేజీ వలన వాటర్ ట్యాంకు మొత్తం బయటి భాగం పాకూరు పట్టిపోయిందని చూస్తే అట్టే తెలిసిపోతుంది. వాటర్ ట్యాంకు నింపుతున్నప్పుడు ఎప్పటికప్పుడు జిపి అధికారి మానిటరింగ్ చేస్తూ, ట్యాంక్ నిండగానే బోరు మోటర్ నిలిపివేయాలి అప్పుడే లీకేజీ సమస్య తీరుతుందని గ్రామస్తులు అంటున్నారు. బోరు మోటారు ఆన్ చేసి నిర్లక్ష్యంగా ఉండి పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా పునారావృతం అవుతూనే ఉంది అని గ్రామస్తులు అంటున్నారు. వాటర్ ట్యాంక్ ఉన్న ప్రదేశం అంతా పిచ్చి మొక్కలు , ముళ్ళ పొదలు తొలగించాలని నివాస గృహాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రదేశం ప్రాంతమంతా పరిశుభ్రంగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.