Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీటి ట్యాంకులను శుభ్రం చేయాలి: ఎంపీఓ

నీటి ట్యాంకులను శుభ్రం చేయాలి: ఎంపీఓ

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : మండలంలో ని జీపీ గ్రామాలలో వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని జుక్కల్ ఎంపీఓ రాము అన్నారు. మంగళవారం మండలంలోని లాడేగావ్ గ్రామంలో నీటి కులాయిలను, వాటర్ ట్యాంకులను , మురికి కాల్వలను ఎంపీఓ రాము క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ఉన్నందున సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా శుభ్రత పాటించాలని కార్యదర్శీకి సూచించారు. వాటర్ ట్యాంకులలో దోమల బెడద లేకుండా, నీటీ పురుగులు  రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు.

క్రిమి, కీటకాలు రాకుండా నివారణ చర్యలో భాగంగా కుళాయిల పరిసరాలతో పాటు వాటర్ ట్యాంకు లోపలి భాగంలో శుభ్రం చేయాలని జిపి కార్యదర్శీకి ఆదేశించారు. ఎంపీఓ రాము స్వయంగా వాటర్ ట్యాంక్ లోకి దీపి కార్మికుల చేత శుభ్రం చేయించారు. దోమల వలన పలు రకాలైన రోగాలు వస్తాయని వాటిని నివారించేందుకు గ్రామాలలో వారానికి రెండుసార్లు గ్రామాలలోని విధులలో ఫాగింగ్ చేయాలని తెలిపారు. గ్రామాలలో మురికి కాలువలు శుభ్రత పాటించకపోతే, నిబంధనలు ఉల్లంఘిస్తే కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -