జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి, మాట్లాడారు. హాస్టల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారి బాగోగులు చూసుకోవాలన్నారు. తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను మనపై నమ్మకంతో పంపిస్తున్నందున వారిపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కోరారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని పెట్టాలనీ, విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టి అర్థమయ్యేలా బోధనను అందించాలన్నారు. హాస్టల్స్ లో పరిశుభ్రమైన ఆహారాన్ని వడ్డించాలన్నారు. నాణ్యత కలిగిన వంట సరుకులు, కూరగాయలు వాడాలన్నారు.
విద్యార్థుల ఆరోగ్య కట్ల కూడా శ్రద్ధ చూపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పి స్వాతి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రిన్సిపల్స్, హాస్టల్ వార్డెన్స్ వసతి గృహాల్లో పాటించవలసినటువంటి పరిశుభ్రత నాణ్యమైన ముడి సరుకులతో తయారు చేయవలసినటువంటి ఆహార నియమాలను, వంట చేసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలను ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. నిబంధనలను పాటించని వారిపై తగు చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి జిల్లా, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి శ్యాంసుందర్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి పి సాహితీ డి ఆర్ డి ఓ నాగిరెడ్డి , జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.స్వాతి,తో కలిసి వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కేజీబీవీ , టి జి ఎం ఎస్ సంక్షేమ హాస్టల్స్ యొక్క ప్రిన్సిపల్స్ , హెచ్ డబ్ల్యు ఓ లు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES