నవతెలంగాణ-హైదరాబాద్: 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని ఇవాళ చత్తీస్‌గఢ్‌లో 170 మంంది మావోయిస్టులు లొంగిపోయిన విషయాన్ని ఆయన తెలిపారు. బుధవారం 27 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. గత రెండు రోజుల్లో చూస్తే 258 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు అమిత్ షా ప్రకటించారు. నక్సలిజంపై పోరులో ఇదొక అరుదైన మైలురాయి అని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు తన ’ఎక్స్’ హ్యాండిల్‌లో మావోయిస్టులు లొంగుబాటు విషయాన్ని అమిత్ షా చెప్పుకొచ్చారు.
నక్సలిజాన్ని నిర్మూలించడానికి మేము కట్టుబడి ఉన్నాం: అమిత్ షా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES