Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

- Advertisement -

– టీఎస్టీయూ డైరీ ఆవిష్కరణలో మంత్రి పొన్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. టీఎస్టీయూ నూతన సంవత్సరం డైరీని ఆయన బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 317 జీవో ద్వారా నష్టపోయి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు, స్పౌజ్‌ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలతోపాటు పీఆర్సీ అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ వర్తింపజేసే అంశం ప్రభుత్వ పరిశీనలో ఉందని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి ప్రస్తుతం చెల్లిస్తున్న రేట్లను పెరిగిన ధరలను అనుసరించి పెంచాలని టీఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీయూ రాష్ట్ర బాధ్యులు అప్సర్‌ అహ్మద్‌, శ్రీనివాస్‌రెడ్డి, సయ్యద్‌ రహమతుల్లా, కె సత్యనారాయణ, మహమ్మద్‌ ఇక్బాల్‌, ఆసీఫ్‌, జాహెద్‌, ఎలమదాసరి రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -