బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు తక్కళ్లపల్లి రవిందర్‌రావు, బండా ప్రకాష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గతంలో ఉన్న 13 కార్పొరేషన్లకు తోడు తమ సర్కార్ 8 కార్పొరేషన్లు, ఒక ఈబీసీ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమగ్రమైన ప్రణాళికతో కొత్త కార్పొరేషన్లకు శాశ్వత సిబ్బందిని నియమిస్తామన్నారు. ధోభీ, కుమ్మరి సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు వివరించారు. గత ప్రభుత్వం 42 బీసీ ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఇచ్చినా, అభివృద్ధికి నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు.
మూడు భవనాల నిర్మాణ పనులు మద్యలో ఉన్నాయని తెలిపారు. కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలన్నారు. పూర్తయిన కురుమ భవనంలో విద్యాసంస్థ, హస్టల్ ఏర్పాటులో కుల సంఘాల నాయకుల్లో విభేదాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కుల సంఘాల భవనాల నిర్వహణ విషయంలో స్పష్టమైన విధివిదానాలను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. బీసీ ప్రజా ప్రతినిధులతో శాసన సభ సమావేశాల్లోపు మీటింగ్ ఏర్పాటు చేసి. బీసీ సబ్ ప్లాన్, ఇతర అంశాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



