రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం నమ్మకం (హోప్) కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో పెట్టుబడులపై అతిశయోక్తులతో వాస్తవాలకు మించి ప్రచారం (హైప్) చేసుకున్నారని విమర్శించారు. రెండు ప్రభుత్వాలకు మధ్య తేడా ఇదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. సోమవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావొద్దనీ, పెట్టుబడులు, ఉద్యోగాలు రావొద్దనేదే బీఆర్‌ఎస్ విధానమని విమర్శించారు. అందుకే మాజీ సీఎం కేసీఆర్ పారిశ్రామికవేత్తలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన హయాంలో తక్కువ పనిచేసి, ప్రచారం ఎక్కువ చేసుకున్నారనీ, తాము దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నామని వివరించారు.
ఆయన హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ‘కుటుంబం’ అనుమతి తప్పనిసరి అనీ, ఆ ‘గేట్ పాస్’ కల్చర్‌కు తాము ఫుల్‌స్టాప్ పెట్టామని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌లో వచ్చిన రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు, ఎంఓయూలు అబద్ధమని చెప్పి, ఆయన దిగ్గజ వ్యాపార సంస్థల్ని కించపరిచారన్నారు. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పేటెంట్ హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉన్నాయన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపామన్నారు. కేసీఆర్ విమర్శలు చేసేముందు ఓసారి గతాన్ని చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజాప్రభుత్వంపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ప్రపంచపటంలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలుపుతామన్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్కు మీద పేటెంట్ ఎవరిదని ప్రశ్నించారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై బీఆర్‌ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు.
మేం ‘హోప్’ క్రియేట్ చేస్తున్నాం…మీలా ‘హైప్’ చేసుకోవట్లే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



