Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నాం: ఎమ్మెల్యే

పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నాం: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నాం అని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. 

కల్వకుర్తి నియోజకవర్గం లో దాదాపు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులందరూ చేపట్టారని. మొదట విడత లక్ష రూపాయలు అందరూ తీసుకున్నారని, మరికొన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -