Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీ డబ్బులు మీకే ఇస్తున్నాం: ఎమ్మెల్యే పైడి

మీ డబ్బులు మీకే ఇస్తున్నాం: ఎమ్మెల్యే పైడి

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్ : ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలకు ఇస్తున్న డబ్బు ప్రజలవేనాని, భవిష్యత్ తరాలకు అప్పులు చేసి ఇస్తున్నామని ఆర్మూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో సాది ముబారాక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఈ డబ్బులను వృథా ఖర్చులు చేయకుండా, అప్పులు చెల్లించడనికో, అవసరాలు తీర్చుకోవడానికో ఉపయోగించాలని తెలియజేశారు. సుమారు 71 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండల అధికారులతో రహస్య రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ శేఖర్, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, లబ్ధిదారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -