Sunday, May 18, 2025
Homeదర్వాజయుద్ధం మధ్యలో మనం

యుద్ధం మధ్యలో మనం

- Advertisement -


”శాంతిని అభిలషించడమే అన్నిటికన్నా పెద్ద అశాంతి”
(వాడ్రేవు చినవీరభద్రుడి కవిత ‘నటాషా నటాషా’ నుంచి)

అఫ్సర్‌ అందరికీ తెలిసిన అందరి కవి. తన కవిత్వ ప్రస్థానంలో ఎన్నో యుద్ధాలూ ప్రార్థనలూ చేసినవాడు. తొలినాళ్ళలో (అంటే రక్తస్పర్శ రోజుల్లో) తనది అస్పష్ట కవిత్వమని పక్కకు తోసేసినవాళ్ళతో యుద్ధం చేశాడు. ఏ కవిత్వమైనా మనకేం చెబుతోందీ, మనమేం వింటున్నాం అన్న ప్రశ్న ఉదయించినప్పుడు విమర్శకులూ సమీక్షకులూ పాఠకులకు దగ్గరగా జరిగి మాట్లాడాలి. Highbrow విమర్శకుల వల్ల కవిత్వం పాఠకులను పోగొట్టుకుంటే ముందు నష్టపోయేది కవే. అఫ్సర్‌ మళ్ళీ ఈ మధ్య ‘యుద్ధం మధ్యలో నువ్వు’ అంటున్నాడు. ఈ సంపుటిలోనేకాక, అఫ్సర్‌ కవిత్వమంతా కనిపించే ‘నువ్వు’ మనందరమూ, అఫ్సర్‌తో కలుపుకొని. ఇక్కడ యుద్ధం కేవలం సామాజికమైనదో రాజకీయమైనదో అయిన అర్థానికే పరిమితమయి లేదు. యుద్ధమంటే అందరూ చేసే అంతర్యుద్ధం కూడా.
జీవితం మత్యువుకూ చలించని జడపదార్థమవ్వడం వల్లనే ఒక తత్త్వవేత్త లాంతరు వెలుగులో సూర్యుడిని చూపించమన్నట్టుగా, మనం యుద్ధ రంగాన ఉన్నామని ఈ సంపుటితో అఫ్సర్‌ చెప్పాల్సివచ్చింది. తెలుగు పాఠకులంతా మంచి కి మొహం వాచి ఉన్నారని ఈయనకు ఎవరు చెప్పారో ఏమో గానీ, ఇందులో సదా ఒక సౌరభాన్ని పంచే ‘క్రీడా వినోదం’ అనే శ్రీశీఙవ జూశీవఎ ఉంది. గతంలో ఎవరూ ఇటువంటిది రాయలేదు, భవిష్యత్తులోనూ ఉండదు. ఎందుకంటే ప్రేమ కవితలు సశీరష్ట్రవతీ (లి) కాదు అని కవులంతా నమ్ముతున్నట్టే ఉంది. నిజానికీ ప్రేమకవితను ఆద్యంతం ఇక్కడ నబశ్‌ీవ చెయ్యాలనే ఉంది. అఫ్సర్‌కు ఒక సన్నని పట్టుపోగునిచ్చినా దాన్ని మళ్ళీ మళ్ళీ కోమలమైన ఆర్ధభావనలతో తడిపేసి రసాప్తుతం చెయ్యగలడు. ఈ కవిత సొంతగా మనసులో చదువుకోవడమనేది ఎన్నేళ్ళకో అనుకోకుండా కలిసిన బాల్యస్నేహితుడు చేతిలో తాయిలం పెట్టడానికి బదులు, ఇంటికి పిలిచి విందునివ్వడం వంటిది.
ఇవాళ మనం శాంతి అశాంతి ఏకీభూతమైన అద్వంద్వం దంష్ట్రల్లో చిక్కుకున్నాం. ఇద్దరి మధ్య సీరియస్‌ సంభాషణ మగ్యమైపోతోంది. మనిషి తను తనతో, తనలోని దైవాంశతో సామరస్యం సాధించలేకుండా ఉన్నాడు. అటువంటి ఇవాళి నేపథ్యానికి తగినట్టు రాశాడీ కవిత్వం, అఫ్సర్‌. నిప్పురవ్వ దావానలాల్ని రేపినట్టు, దేశంలో అసహనం ప్రజావర్గాల మధ్య చిచ్చుపెట్టినప్పుడు తటస్థంగా ఉండడం కూడదని చరిత్ర పాఠం, గుణపాఠం కూడా చెబుతోంది. నిద్రాళువై క్రియాశీలపరత్వం లేనివాడిని, కవి ”నువ్వొక రణరంగమైన పెనుమంటవని పొరపాటున కూడా అనుకోవు కదా” అని వగచి, ”కానీ నీ చేతుల్ని యే కొంచెమో ఆ మంట వైపు కదిల్చావే అనుకో అదే నీ పెను నిద్దరలో కార్చిచ్చు” అన్న నిర్ధారణ హెచ్చరికా? కనువిప్పా? మన సమీపానే – చెయ్యి చాచితే చాలు, వ్యథార్త జీవిత యథార్థ దశ్యం చిచ్చై అంటుకొని కాలుస్తుందది – ఇది కనువిప్పు.
ఈ సంపుటి అంతా ‘నేనూ’, ‘నువ్వూ’ల మయం. తనకూ ప్రపంచానికీ మధ్య సామరస్యం కుదరాలని అఫ్సర్‌ అందరితో చేస్తున్న అంతర్‌ బహిర్‌ యుద్ధారావం. చిత్రంగా ఇందులోని యుద్ధ గుంజన్‌ మృదంగాల ఘోష తియ్యగా ఉంటుంది. అఫ్సర్‌ కవితలో ముందు చెప్పుకోవాల్సిన లక్షణం నాదం. ఇది బహుశా సహజాతమైన గుణం, కవి ప్రతిభావిశేషం. కవిత కవి మనసులో పుడుతూనే నాదాన్ని పుణికి పుచ్చుకుంటుంది కాబోలు. ఎక్కడా గతితప్పని నాదడోలికలు అన్ని కవితలూ. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి, ”నీ లోపలి ఖాళీలకు ఆవులింతలొచ్చి నిన్ను నువ్వే ఆపాదమస్తకం వెక్కిరించుకుంటావు”. ఇది కవి ఎవరో కువిమర్శకుడికి ఇచ్చిన తీఱజూశీర్‌వ అనుకుంటాను. అది పక్కన పెడితే, మొత్తం వాక్యంలో ఒక వన్నె, ఒక తూగుతున్న బొమ్మ, ఒక వయ్యారం కనిపిస్తాయి. ”నాక్కాస్త ఆకాశమ్ముక్క కావాలి/ యెవరైనా తెచ్చిస్తారా” అని కవి అడగ్గానే ఏ అభిమాని అయినా ముందుకొచ్చి ”ఇదుగో, రా ఇస్తాను” అని ఎదురు సన్నాహాలు చేస్తాడు. ఈ వాక్యంలో ఏ పదమూ పునరుక్తి కాలేదు. మాటల్ని అటూ ఇటూ తిప్పే వైనమూ అఫ్సర్‌కి బాగా తెలుసు. ”యేం పోగొట్టుకున్నామో తెలియనప్పుడు/ యేం మిగుల్చుకున్నామో కూడా తెలీదు”. కవి శబ్దాల ఐంద్రజాలికుడైనప్పుడు కవితలో విషయాన్ని అందజేయడం సులభతరమౌతుంది. పఠిత హదయాన్నే కవి శాసించగలడు కనుక. అఫ్సర్‌ తనలో బాల్యాన్ని దుర్భేద్యమైన కోటలో పదిల పరుచుకొని నలువైపులా రక్షించుకుంటున్నాడు. ”ఆ వూరాఖరి చెర్వు/ చెవిలో పోసిన రహస్యాలన్నీ నీకే చెప్తాను…. యిక్కడికొచ్చేసరికి/ అంతేసి సముద్రం కూడా చిన్ని శంఖమై పోతుంది” అన్నప్పుడు పెద్దలైతే ముందు చెవి ఒగ్గి వినాలని ఎదురుచూస్తే, పిల్లలు శంఖం ఊదాలనుకుంటారు. ఇది అమెరికాలో ఆచార్యుడైన అఫ్సర్‌ రాయలేదు, చింతకాని స్కూల్‌ పిల్లడే రాశాడు.
అఫ్సర్‌ అంతర్‌ బహిర్‌ యుద్ధం ప్రతిద్వంద్వితో బాహాబాహీగానో ముష్టాముష్టీగానో కాదు, ఎలమిన చెట్టపట్టాలేసుకొని సాగుతుంది. కడదాకా చర్వితచర్వణమౌతూంటుంది – ”మనిద్దరి మధ్యా వున్నవి కొన్ని పదాలే/ అవి సరిగా పలకలేదని నువ్వూ/ అంతే పలుకుతున్నాయని నేనూ/ యెన్ని యుద్ధాలకు దిగామో తెలుసా?/ అసలు యుద్ధాలన్నీ/ యిక్కడే మొదలై/ యిక్కడే ముగుస్తూ ఉంటాయి/ లేదూ/ ముగిశాయని అనుకుంటూ వుంటాం/ మరో క్షణమేదో దాడికొచ్చేదాకా” అన్న విధంగా. కవి తాత్త్వికుడివలే గర్జించినా ప్రాయశ్చిత్తానికి సంసిద్ధతనూ ”నా అనేక పాత్రల అభినయాల మీద నేనే హేళన చేసుకునే వేళ అది” అంటూ కనబరుస్తాడు.
”నువ్వూ నేనూ/ సగంలో వదిలేసిన పద్యాలం/ నువ్వూ నేనూ కుంచె మరచిపోయిన చిత్రాలం” అన్న శాంతికపోతాన్ని చేరదియ్యాలి. రెండూ చెయ్యాలేమో, రెండూ ఒకటేనేమో! కవేత్వమేవాహమ్‌ అంటూ ఎదరి పక్షాన్నీ అవపోశన పట్టేశాడా? ఉభయులూ గెలిచాక చేసుకునే ఉమ్మడి సంబరాలకై కవి ”నీదైన వెలుగులోకి సరాసరి నడిచే వస్తా”నని వాగ్దానం చేశాడు. కవి ఆ మాట నిలబెట్టుకుంటాడు కూడా, ఎందుకంటే ”మనిద్దరం మబ్బు సిగలో సింగిడి, రా” అని స్వయానా పిలుస్తున్నాడు కదా!
అఫ్సర్‌ కవిత్వంలో వైరుద్ధ్యాల కోసం వెతికీ ఎత్తిచూపి ఏమీ ప్రయోజనం లేదు. ఏ వైరుద్ధ్యమూ లేకుండానే జీవితాలు సాగట్లేదు, అనుభవాలు దొరకట్లేదు, సమాధానాలు పుట్టట్లేదు. అంతే కాక, అఫ్సర్‌ కవిత్వం దాని ఎవతీఱ్‌ మీద అది నిలబడేదే. తన కవిత్వంలో తను ఎలాగూ దొరుకుతాడు. అక్కడే అఫ్సర్ని పట్టుకోండి.

  • వాసు, 9901155133
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -