శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని జీవీకే తెరకెక్కించారు. నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మూవీ టీమ్ కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ,’ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా, ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీలోని వారు కూడా మా సినిమా గురించి బాగా పాజిటివ్‌గా చెబుతున్నారు.
మూవీలో మేమంతా బాగా నటించామని అంటున్నారు’ అని తెలిపారు. ‘మా సినిమాకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించినదాని కంటే బాగా రెస్పాన్స్ ఉంది. మా మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాపై మా నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’ అని డైరెక్టర్ జీవీకే అన్నారు. హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ,’సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మేమంతా పాజిటివ్ వైబ్‌లో ఉన్నాం. ఈ వైబ్ ఇలాగే కొనసాగాలి. అన్ని సెంటర్స్ నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది. అన్ని ఏరియాల్లో షోస్ పెంచుతున్నారు. రేపు వాలెంటైన్స్ డే సందర్బంగా ఒక టికెట్ మీద కపుల్ సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నాం. సినిమా బాగుందంటూ నాకు మెసేజ్‌లు వస్తున్నాయి. నేనూ బాగా నటించానని అంటున్నారు’ అని చెప్పారు.
థియేటర్లు, షోలు పెంచుతున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



