Tuesday, February 17, 2026
E-PAPER
Homeజాతీయంమేం నిర్దోషులం .. విచారణను ఎదుర్కొంటాం : లాలూయాదవ్‌

మేం నిర్దోషులం .. విచారణను ఎదుర్కొంటాం : లాలూయాదవ్‌

- Advertisement -

న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగాల కోసం భూమి అవినీతి కేసులో తాము దోషులం కాదని, విచారణను ఎదుర్కొంటామని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవి స్పష్టం చేశారు. సోమవారం రౌస్‌ అవెన్యూలోని ప్రత్యేక సిబిఐ కోర్టుకు వారు హాజరయ్యారు. అవినీతి, మోసం మరియు నేరపూరిత కుట్ర ఆరోపణలను తిరస్కరిస్తూ.. తాము నిర్దోషులమని పేర్కొన్నారు. మెరిట్‌ ఆధారంగా విచారణను ఎదుర్కొంటామని అన్నారు. ఈ కేసులో ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవి, తేజస్వీయాదవ్‌ మరియు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌లపై ఫిబ్రవరి 1 నుండి 25 వరకు అధికారికంగా అభియోగాలు మోపడానికి సిబిఐ కోర్టు జనవరి 29న అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. నిందితులు కనీసం ఒకరోజు ముందస్తు సమాచారంతో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మార్చి9 విచారణ ప్రారంభ తేదీగా ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -