Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఐటిఐలను ఆధునికరిస్తున్నాం

ఐటిఐలను ఆధునికరిస్తున్నాం

- Advertisement -

ఏటీసీ ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు 
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
నవతెలంగాణ – మణుగూరు
ఐటిఐ లను ఆధునికరించే క్రమంలో ఏటీసీలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వం కల్పించే అవకాశాలను యువత అందిపుచ్చుకొని తమ భవిష్యత్తును బలోపాతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కళాశాల మరియు ఏటీసీ సెంటర్ ను ఆకస్మికంగా  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఐటిఐ లను ఆధునీకరించే క్రమంలో ఏటీసీలను ఏర్పాటు చేశామని అన్నారు వీటిలో శిక్షణ పొందిన విద్యార్థులకు పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఏటీసీ శిక్షణ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి వివిధ పరిశ్రమంలో ఉద్యోగ అవకాశాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని  భరోసా ఇచ్చారు. విద్యార్థులు శిక్షణ కాలంలో కష్టపడి చదివి సంపూర్ణ నైపుణ్యాన్ని పొందాలని, వారికి కావలసిన పుస్తకాలను ఉచితంగా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఐటిఐ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు పరికరాలు కల్పించాలని దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అనంతరం కలెక్టర్ మణుగూరు తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో  తెలంగాణ 11వ ఎన్ సి సి ఖమ్మం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్ సి సి క్యాంపును సందర్శించారు. ఈరోజు ప్రారంభమైన ఈ ఎన్ సి సి క్యాంపు 17వ  వరకు పది రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 700 మందితో ఈ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కమాండెంట్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర, మరియు క్యాంప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్ యాదవులను కలిసి క్యాంపు వివరాలు, శిక్షణ, శిక్షణానంతరం ఉద్యోగ అవకాశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంపు సజావుగా నిర్వహించడానికి  అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

క్యాంపు ప్రదేశంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ సి సి శిక్షణ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వం మరియు దేశ సేవ వంటి విలువలు పెరుగుతాయన్నారు. జిల్లాలో రథం గుట్ట వంటి సహజ సౌందర్య ప్రదేశాలను ఎన్ సి సి అడ్వెంచర్ క్యాంపులకు వినియోగించుకోవచ్చని అన్నారు దీని ద్వారా జిల్లా పర్యాటక రంగంలో మరింత ప్రాధాన్యతను పొందుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఐటిఐ సూపర్డెంట్ జ్యోతిరాణి, ఏటీఓ లు జీ.వీ కృష్ణారావు, వేణుగోపాల్ మరియు ఏటీసీ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad