Monday, January 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకట్టుకథలకు భయపడేది లేదు

కట్టుకథలకు భయపడేది లేదు

- Advertisement -

– తెలంగాణ కోసమే రాజకీయాల్లోకి వచ్చా : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కట్టు కథలకు భయపడేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోసమో, అధికారం హౌదాను అనుభవించడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. దారి దోపిడీదారులు, బందిపోట్ల నుంచి తెలంగాణ ఆస్తులను, వనరులను రక్షించి, వాటిని ప్రజలకు అందజేయడం కోసమే వచ్చానని తెలిపారు. ఓ తెలుగు దిన పత్రికలో తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వార్తలు రాశారని ఆరోపించారు. నైని బొగ్గు గని టెండర్ల విషయంలో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డు ఖరారు చేస్తుందే తప్ప మంత్రికి సంబంధం ఉండదని తెలిపారు. ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేయాలని సూచించినట్టు తెలిపారు. తాను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సన్నిహితంగా ఉండటంతోనే ఆ పత్రిక యజమాని ఆయనపై ఉన్న కోపంతో తనపై ఈ వార్త రాసినట్టుగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలతో అధికారులు, మంత్రులు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులమంతా రాష్ట్ర ప్రజల విస్తత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. చిల్లర కథనాలతో భయపెట్టాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిం చారు. తాను రాజకీయాల్లోకి గాలికి రాలేదని 40 సంవత్సరాలుగా సభలో ,బయట ఉండి ప్రజల కోసం పోరాటాలు చేసి వచ్చానన్నారు. త్వరలో పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తానని భట్టి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -