Saturday, September 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం..

హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం..

- Advertisement -

వార్డెన్ గోపాల్
నవతెలంగాణ – జన్నారం

జన్నారం మండలంలోని తపాలపురం గ్రామంలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో ఉన్న విద్యార్థులు శుచీ, శుభ్రతను పాటించాలని హాస్టల్ వార్డెన్ గోపాల్ అన్నారు. శనివారం హాస్టల్లో వసతి పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లలో ఉంచుకోకుండా.. హాస్టల్ కు పంపించాలన్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హిందీ టీచర్ రాజేందర్ అంగన్వాడీ టీచర్ మామిడి కవిత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -