నవతెలంగాణ – చండూరు
హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్నామని హాస్టల్ వార్డెన్ లు లింగయ్య, రమ్యశ్రీ తెలిపారు. శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ పట్టణంలో ఎస్సీ బాలికల వసతిగృహం, ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు చేశారు.
హాస్టల్ వార్డెన్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని, అందిస్తున్నామని, విద్యార్థుల పట్ల చదువుపై శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు , హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES