నవతెలంగాణ – ఆలేరు టౌను
రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామని యాదాద్రి జిల్లా ఎస్పీ అక్షాంష్ యాదవ్ అన్నారు. ఆలేరు పోలీస్ కార్యాలయాన్ని గురువారం జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత కొరకు వాహనదారులకి అవగాహన కల్పిస్తున్నామన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ద్విచక్ర వాహనా దారులు, హెల్మెట్ ధరించాలన్నారు. అయినార్లు వాహనాలు నడపవద్దన్నారు. వేసవిలో దొంగతనాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, పెట్రోలింగ్ వాహనాలతో గస్తి ముమ్మరం చేశామన్నారు. స్కూల్ కాలేజీ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. మట్టి ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తహసిల్దారు పర్మిషన్ తోనే ఇసుక రవాణా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, డిఎస్పి శ్రీనివాస్ నాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ యాలాద్రి, ఎస్సై వినయ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకుంటున్నాం : జిల్లా ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



