Friday, September 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బిడ్డల క్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్

బిడ్డల క్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్

- Advertisement -

రైల్వేస్టేషన్ లో బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్కో ప్రారంభం
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

మహిళ భద్రతతో పాటు వారి బిడ్డల క్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషన్ మహా కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ లో బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్కోను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమ సింగ్ టాగూర్ తో కలిసి కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరై కియోస్కోను ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ గదులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ… ప్రయాణంలో తల్లులకు బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కియోస్క్ లను ఏర్పాటు చేశామన్నారు. ఆరు నెలల వరకు తల్లి పాలు బిడ్డకు ఎంతో అవసరమన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తల్లి పాలు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. తల్లులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా పురుషులు కూడా పోషన్ మహాలో భాగస్వాములై మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు.

రైల్వే తరపున సౌకర్యాలు కల్పిస్తున్నాం

ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమ సింగ్ టాగూర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి పోషన్ మహాలో భాగంగా కియోస్కో ను ఏర్పాటు చేశారన్నారు. రైల్వే తరపున కూడా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అయితే తల్లుల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. ఇది నవజాత శిశువులకు పాలు ఇవ్వడానికి తల్లులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ నాందేడ్ డివిజన్ సెక్యూరిటి కమిషనర్ అమిత్ ప్రకాష్ మిశ్ర, డిడబ్ల్యూఓ మిల్క, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, యశోద పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -