Monday, March 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమేమే విలన్లం

మేమే విలన్లం

- Advertisement -

ఇరాన్‌ పాఠశాల లక్ష్యంగానే దాడి
అది పథకం ప్రకారమే జరిగింది : యూఎస్‌ సైనిక మాజీ నిఘా, ఉగ్రవాదనిరోధక అధికారి వెల్లడి

వాషింగ్టన్‌: ఇరాన్‌లోని మినాబ్‌లో బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడి ప్రపంచ మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురి చేసిందని అమెరికా సైనిక మాజీ నిఘా, ఉగ్రవాద నిరోధక అధికారిణి జోసెఫిన్‌ గిల్బో అన్నారు. అమెరికా పకడ్బందీగా ప్రణాళిక చేసి, ఉద్దేశపూర్వకంగా అమలు చేసిందని ఆమె వెల్లడించారు. అమెరికా సైన్యంలో పనిచేసిన జోసెఫిన్‌ గిల్బో, అమెరికా-ఇజ్రాయిల్‌ కూటమి జరిపిన దురాగతాల గురించి వివరించారు. ఇరాన్‌ పాఠశాలపై 165 మంది బాలికలను బలిగొన్న ఈ దాడి ప్రమాదవశాత్తు జరగలేదని, పూర్తి అవగాహనతో పథకం ప్రకారం జరిపిన బాంబు దాడి అని అభివర్ణించారు. సంఘర్షణ ప్రాంతంలో మోహరించిన అమెరికా నౌకాదళానికి చెందిన నౌకల నుంచి ఈ ప్రాణాంతకమైన తోమాహాక్‌ క్షిపణులను ప్రయోగించారు. అధునాతన లైవ్‌ కెమెరా వ్యవస్థలతో కూడిన ఈ క్షిపణులు, నిర్దేశిత లక్ష్యాలను కమాండర్లకు రియల్‌టైమ్‌ దృశ్యాలను ప్రసారం చేశాయి.

అంటే, దాడి జరుగుతున్నప్పుడు అమెరికా సైన్యం ఆ పాఠశాలను గమనిస్తూనే ఉంది. పాఠశాల రంగురంగుల ఆవరణలో పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు ఉపగ్రహ చిత్రాలు, క్షిపణులలోని కెమెరాలలో స్పష్టంగా కనిపించాయి. ఈ సమాచారం అందిన తర్వాత కూడా అమెరికన్‌ కమాండర్లు దాడికి ఆదేశించారని గిల్బో పేర్కొన్నారు. ఈ అంశంలో సంఘటనల క్రమం ఈ విధంగా ఉన్నది. ఉదయం 10 గంటలకు, అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై దాడి చేసింది. ఉదయం 10:20 గంటలకల్లా, మినాబ్‌లోని పాఠశాల అధికారులు పిల్లలను ఖాళీ చేయించడం ప్రారంభించారు. మొదటి క్షిపణి నేరుగా పాఠశాల భవనాన్ని తాకింది. భయపడిన పిల్లలు పారిపోయి ప్రార్థనా మందిరంలో ఆశ్రయం పొందారు. ఆ తర్వాత, పిల్లలు తలదాచుకున్న ప్రార్థనా మందిరాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని రెండో క్షిపణిని ప్రయోగించారు. క్షణాల్లో 163 మంది బాలికలు మరణించారు. ఆ తర్వాత, ప్రాణాలతో మిగిలిన వారిని అంతం చేయడానికి పాఠశాల మైదానంపై మూడో దాడి జరిగింది. మొత్తమ్మీద, ఒక వ్యవస్థీకృత మారణకాండగా మాత్రమే వర్ణించగల ఈ ఘటనలో 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు.

తమ దేశ చర్యలను గిల్బో ఖండించారు. అమెరికా ఉగ్రవాద నిరోధక చట్టాలను ప్రస్తావించారు. ”భయం, బలవంతం ద్వారా రాజకీయ లేదా మతపరమైన లక్ష్యాలను సాధించడానికి పౌరులపై చేసే హింసే ఉగ్రవాదం. ఆ నిర్వచనం ప్రకారం, మనమే (అమెరికా) ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాదులం. ఈ కథలో మనమే ప్రతినాయకులం” అని ఆమె వివరించారు. ఆ క్షిపణులను యూఎస్‌ఎస్‌ స్ప్రూన్స్‌ నుంచి ప్రయోగించారని, ఈ దాడిలో కమాండర్లు లీ ఆర్‌. టేట్‌, జెఫ్రీ ఇ. యార్క్‌లకు ప్రత్యక్ష ప్రమేయం ఉందని గిల్బో తెలిపారు. యూఎస్‌ ట్రిపోలి కమాండర్‌ పాట్రిక్‌ జీ. సల్లివాన్‌కు గిల్బో నేరుగా ఒక విజ్ఞప్తి చేస్తూ.. ఆమె ‘యుద్ధ నేరం’గా అభివర్ణించిన చర్యలో భాగస్వామి కావడానికి నిరాకరించి, తమ నౌకను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయనను కోరారు. అయితే, ఈ దాడికి సంబంధించి అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి బాధ్యతనూ అంగీకరించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -