– రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది కేసీఆర్ నే….
– ఏజన్సీ సమస్యలు పరిష్కారానికి కమిటీ
– భూ భారతి తో రైతుకూ భూధార్…
– మంత్రి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేకపోతున్నామని,దీనికి కారణం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులు కుప్పగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చడం మే కారణమని రాష్ట్రం రెవెన్యూ, గృహ నిర్మాణం,సమాచార,పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ధైర్యంగా చెప్తున్నా మంటూ ప్రకటించారు.దీనికి రాష్ట్రంపై ఉన్న అప్పుల భారమే నని స్పష్టం చేసారు. మండలంలో సోమవారం పర్యటించిన మంత్రి స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో గృహనిర్మాణ శాఖ చే రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన “ఇందిరమ్మ నమూనా ఇళ్ళు” ని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో రూ.3 కోట్ల 70 లక్షలతో నిర్మించనున్న “వంద పడకల ఆసుపత్రి” నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.అక్కడ నుండి అశ్వారావుపేట – బూర్గంపాడు రోడ్ లోని శ్రీ శ్రీ ప్రైవేట్ ఫంక్షన్ హల్లో రెవిన్యూ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన “భూ భారతి చట్టం – 2025″రైతు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొన్ని హామీలను మాత్ర ఎందుకు అమలు చేయలేకపోతున్నామన్నది ప్రజలకు చెప్పలేం అంటూ వ్యాఖ్యానించారు.అయినా ప్రభుత్వం ఉన్న దాంట్లో ప్రజల అవసరాలను గుర్తించి పని చేస్తున్న ప్రభుత్వం…
ఇందిరమ్మ ప్రభుత్వం…
పేదల ప్రభుత్వం అన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఇచ్చిన హమీలను కూడా అమలు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు చిరకాల కోరిక, దానిని నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇంటి పథకం తీసు కొచ్చి నట్లు పేర్కోన్నారు.మొదటి విడతలో స్థలాలు ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరి చేసారు.ఇందిరమ్మ కమిటీలు కూడా అర్హులను గుర్తించి ఇళ్ళు మంజూరు చేయాలని,అనర్హులకు మంజూరు చేస్తే అధికారులు రద్దు చేస్తానని. ఈ చర్యతో కమిటీ బాధ్యులు నొచ్చుకోవద్దని హెచ్చరించారు.ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగేళ్ళలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం కోసం ప్రజా ప్రభుత్వం తల తాకట్టైనా పెడుతుందని అన్నారు.రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాం మని,రెవెన్యూ అధికారులే బాధ్యతతో పని చేయాలని హితవు పలికారు.అధికారులంతా రైతు కుటుంబాల నుండి వచ్చిన వారే కాబట్టి వారి సమస్యలపై అవగాహన ఉంటుందని,రైతులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తగిన పరిష్కారం చేయాలని సూచించారు.పని చేయని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. ఏజెన్సీ లోని సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర స్థాయీ కమిటీ ఒకటి రూపొందిస్తామని అన్నారు.తరతరాలుగా సోదరభావంతో మెలిగే గిరిజన గిరిజనేతరులు సమస్యలు పరిష్కారం చేస్తాం అన్నారు. భూ భారతి చట్టంతో ప్రతీ రైతుకు భూధార్ కార్డు ఇస్తామని అన్నారు.
పేదలకు ఏవీ ఇళ్ళు…
పలుకుబడి,రాజకీయ పరపతి ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారా.. నిరుపేదలకు ఇళ్ళు మంజూరు చేయరా అంటూ గుర్రాల చెరువు గ్రామానికి చెందిన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరైన మహిళలు మంత్రి ‘పొంగులేటి’ బయలుదేరే సమయంలో దరఖాస్తులు చేతబూని కలిసేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ రీత్యా ఆయన సిబ్బంది వారిని కలవ నీయక పోవడంతో ఆ పేదలు దరఖాస్తులు తో కొంత దూరం వెనక వెళ్ళారు.అయినా మంత్రి స్పందించకపోవడంతో అధికారులు,కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మాకు ఇందిరమ్మ ఇళ్ళు రాకుంటే చావే శరణ్యమని, ఆస్తులు ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని గ్రామ మహిళలు పుష్ప, సరస్వతి,మరియమ్మ, సొంగ లక్ష్మి ఆరోపించారు.బీదలకు ఇళ్ళు ఇవ్వకుండా మా గ్రామం ఎలా వస్తారో చూస్తామంటూ సవాల్ విరిచారు.
భూ భారతితో భూములకు పూర్తి రక్షణ
కొత్తగా వచ్చిన భూ భారత చట్టం -2025 తో రైతు భూములకు పూర్తి భద్రత ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చెప్పారు. గతంలో కొన్ని భూ సమస్యలకు ఈ చట్టంతో పరిష్కారం అవుతాయని అన్నారు.ప్రతి సమస్యకూ భూ భారతిలో పరిష్కారం ఉందని, ఎటువంటి భూ వివాదాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలతో భూములకు రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ఏ సమస్యకు ఎటువంటి పరిష్కార చర్యలు తీసు కుంటాన్నారో వివరించారు.అశ్వారావుపేట మండలంలో అత్యంత సున్నితమైన 911, 152 సర్వే నెంబర్ల లో భూ సమస్యల పరిష్కారం కోసం సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి,ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ కృతఙ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలక్టర్ వేణు గోపాల్,ఆర్డీవో మధు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, హౌసింగ్ పీ.డి శంకర్, మున్సిపల్ కమీషనర్ సుజాత,మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి,అశ్వారావుపేట పీఏసీఎస్ అద్యక్షులు సత్యనారాయణ,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు,జూపల్లి రమేష్,మొగళ్ళపు చెన్నకేశవరావు,పలువురు నాయకులు పాల్గొన్నారు.
హామీలన్నీ అమలు చేయలేకపోతున్నాం…
- Advertisement -
RELATED ARTICLES