సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి
అప్‌గ్రేడ్ అయిన 270 ఉన్నత పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టుల మంజూరుకు హామీ
తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హెడ్‌మాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ నూతన క్యాలెండర్‌ను ఆయన గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. సంఘం నాయకులు తమ సమస్యలను వివరించగా.. సీఎం సలహాదారులు సానుకూలంగా స్పందించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో అప్‌గ్రేడ్ అయిన 270 ఉన్నత పాఠశాలలకు నూతనంగా ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేస్తామని, అలాగే ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఆయనను కలిసిన వారిలో తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ.నజీముద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ చంద్రశేఖర్, కోశాధికారి పి.వెంకటేష్, నాయకులు చక్రారెడ్డి, కృష్ణప్రియ, వివిధ జిల్లాల నుంచి ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
హెడ్‌మాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



