Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీవనదితో జీవితాలు మారుస్తాం

జీవనదితో జీవితాలు మారుస్తాం

- Advertisement -

మూసీనది డీపీఆర్‌ను ప్రజల ముందుంచుతాం : ప్రశ్నోత్తరాల్లో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

మూసీని జీవననదిగా మార్చి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మూసీ డీపీఆర్‌ సిద్ధమైందనీ, దాన్ని ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బీఆర్‌ఎస్‌ సభ్యులు కేటీఆర్‌, బండారు లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్‌ అడిన ప్రశ్నకు సీఎం తరుపున మంత్రి సమాధానమిచ్చారు. మూసీ ప్రక్షాళన కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ)కి ప్రతిపాదనలు పంపించామన్నారు. తమ ప్రతిపాదనల పట్ల బ్యాంక్‌ సంతృప్తి చెందిందని తెలిపారు. ఒకవేళ సంతృప్తి చెందక పోయినా ప్రపంచబ్యాంక్‌తోసహా ఇతర బ్యాంకులను సంప్రదిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మూసీనది ప్రక్షాళన, సుందరీకరణ చేయడమేనని స్పష్టం చేశారు. నదికి ఇరువైపుల 50 మీటర్ల బఫర్‌ జోన్‌గా గుర్తిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పారు. దాన్నే తమ ప్రభుత్వ అమలు చేస్తోందని తెలిపారు. భూసేకరణ, పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. బ్లాక్‌ లిస్టులో ఉన్న మెయిన్‌హార్ట్‌ కంపెనీకి ప్రక్షాళన బాధ్యతలు ఎలా కట్టబెట్టారంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టులను ఆ సంస్థకు కట్టబెట్టిందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -