గుర్రాల బాలకృష్ణ
నవతెలంగాణ – ఆలేర్ రూరల్
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ పాలన ఆఫీసర్‌పై జరిగిన దాడిని తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు.శుక్రవారం నాడు నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ ఏప్రిల్ 8, 2026న గ్రామ పాలన ఆఫీసర్ భూపాల్ విధి నిర్వహణలో భాగంగా భూమి పరిశీలనకు వెళ్లగా,కొంతమంది దుండగులు కళ్లలో కారంపొడి చల్లి దాడికి పాల్పడిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.విషయం తెలుసుకున్న వెంటనే అసోసియేషన్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ మరియు పై అధికారుల సమన్వయంతో నిందితులపై కేసు నమోదు చేయించామని తెలిపారు. ఈ సందర్భంలో మెదక్ జిల్లా కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.



