తెలంగాణ రైతు సంఘం
నవతెంగాణ బ్యూరో-హైదరాబాద్
త్రిపుర రాజధాని అగర్తలలో శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న రైతులు, గిరిజనులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జి చేయించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిం చింది. ఏఐకేఎస్ అఖిలభారత ప్రధాన కార్యదర్శి విజూకృష్టన్, ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి పవిత్రకార్‌ను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి.సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
12 డిమాండ్లతో అఖిల భారత కిసాన్ సభ, త్రిపుర రాష్ట్ర గణముక్తి పరిషత్, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా చేపట్టిన ‘అసెంబ్లీ మార్చ్’ శాంతియుతంగా సాగుతున్న సమయంలో రైతులు, గిరిజనుల ప్రదర్శనను పోలీసులు అడ్డుకుని లాఠీచార్జి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆ దాడిలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి పవిత్ర కర్ చొక్కాను పోలీసు అధికారి పట్టుకుని లాగారనీ, పోలీసుల దాడిలో విజూకృష్ణన్, అఘోర్ దేబ్‌వర్మ, పవిత్రకార్ సహా పలువురు నాయకులు గాయపడ్డారని తెలిపారు. 11 ఏండ్లలో దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ అనుకూల ఒప్పందాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. త్రిపుర పోలీసుల తీరును ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు.
త్రిపురలో రైతులు, గిరిజనులపై లాఠీచార్జిని ఖండిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



