Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా న్యాయవాది హత్యను ఖండిస్తున్నాం

మహిళా న్యాయవాది హత్యను ఖండిస్తున్నాం

- Advertisement -

– న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే ఆమోదించి అమలు చేయాలి : ఐలూ
– స్వప్న మృతదేహానికి నివాళి అర్పించిన పార్ధసారథి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

చేవెళ్ల కోర్టు బార్‌ అసోసియేషన్‌కు చెందిన యువ మహిళా న్యాయవాది స్వప్నను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో దుండగులు హత్య చేయడాన్ని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌(ఐలూ) రాష్ట్ర కమిటీ ఖండించింది. స్వప్న మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ మేరకు ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జి.విద్యాసాగర్‌, రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కె.పార్ధసారథి, రాష్ట్ర కార్యదర్శి సి.రాంచంద్రారెడ్డి, ఉమెన్స్‌ కన్వీనర్‌ సీహెచ్‌ శైలజ, కో-కన్వీనర్‌ ఎం.వనజ ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయవ్యవస్థకు అంకిత భావంతో సేవలందిస్తున్న ఒక మహిళా న్యాయవాదిపై ఈ విధమైన హింస జరగడం అత్యంత బాధాకరమని పేర్కొ న్నారు. దీన్ని కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగానే కాకుండా సమస్త న్యాయవాద వృత్తిపై జరిగిన దాడిగా చూస్తున్నామని తెలిపారు. న్యాయవాదులకే భద్రత లేకపోతే న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వప్న హత్యలో పాలుపంచుకున్న నిందితులందరినీ తక్షణమే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఈ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారించి దోషులకు కఠినమైన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్ధసారథి నివాళి అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -