Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాపై వీడీసీల దాడిని ఖండిస్తున్నాం

ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాపై వీడీసీల దాడిని ఖండిస్తున్నాం

- Advertisement -

మీడియాకు మద్దతుగా ప్రెస్ అకాడమీలో ఫిర్యాదు చేసిన శ్రీధర్ బట్టు..
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి విలేకరిపై దాడి చేసిన వీడీసీలపై చర్యలు చేపట్టాలని వినతి పత్రాన్ని వీడిసి వ్యతిరేక పోరాట సమితి నాయకులు శ్రీధర్ బట్టు అందజేశారు. అనంతరం వారు తెలుపుతూ ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు ప్రజలకు మరియు ప్రభుత్వాలకు అలాగే ప్రజల సమస్యలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్యన వారధిగా వ్యవహరిస్తారని వారి పట్ల దాడులు చేయడం అంటే వాక్కు స్వాతంత్రాన్ని పత్రికా స్వేచ్ఛ ను హరించడమే అని తెలియజేశారు.

అనంతరం మీడియా వ్యక్తులపైన దాడి చేసినటువంటి వారందరినీ చట్టరీత్యంగా శిక్షించి వారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరారు. దానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి  సానుకూలంగా స్పందిస్తూ అధికారిక యంత్రాంగం తో మాట్లాడుతానని మీడియా మిత్రులకు ప్రెస్ అకాడమీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. పత్రికలు వార్తలు అంటేనే ఓ ప్రశ్నించే ఆయుధమని ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే ఇలా దాడులు చేయడం సరికాదని ప్రజలు తమకేదైనా అన్యాయం జరిగినప్పుడు అధికారిక యంత్రం గాని మరియు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లే వారధి రెంటు మరియు ఎలక్ట్రానిక్ మీడియానే కాబట్టి వారి మీద దాడులు చేయడం అంటే అన్యాయానికి ప్రోత్సహించడమేనని ఓ ప్రకటనలో వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -