- Advertisement -
- – ఇందిరమ్మ ఇల్లు కేటాయించండి: ఎంపీడిఓ కు వినతిపత్రం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
డబుల్ బెడ్ రూంలో అర్హుల జాబితాలో మా పేర్లు వచ్చాయని ఇప్పుడు మాకెందుకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని జిల్లెల్ల గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గత నాలుగు రోజుల క్రితం జిల్లెల్ల గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇందిరమ్మ ఇల్లు గా కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేశారని, ప్రభుత్వ స్థలంలో మాకు కూడా స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి బుధవారం వినతిపత్రం అందజేశారు. - ఈ సందర్భంగా కొందరు మాట్లాడుతూ..గతంలో పలుమార్లు అర్హుల జాబితాలో మా పేర్లు వచ్చినా కానీ మా పేర్లను జాబితా నుండి తొలగించి అనరులకు ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు స్థానిక నాయకులు వచ్చిన విధంగా అర్హుల జాబితాను తయారుచేసి అధికారులకు అందించారని ఆ ప్రకారంగానే అధికారులు ఇందిరమ్మ ఇళ్ళను ఇండ్లను పంపిణీ చేశారని ఆరోపించారు. జిల్లాల గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల పక్కన ప్రభుత్వ స్థలం ఉందని, ఆ స్థలంలో మాకు స్థలాన్ని కేటాయిస్తూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో కడమంచి అనూష, బర్ల లక్ష్మి, మల్లమర్రి వెంకటయ్య, చాంద్ పాషా, ఎండి కరీం, ముత్తవ్వ, రాజు, నరసవ్వ ,లక్ష్మీ, స్వప్న, సుశీల పాల్గొన్నారు.
- Advertisement -