Monday, October 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం251 ఉక్రెయిన్‌ డ్రోన్‌లను ధ్వంసం చేశాం: రష్యా

251 ఉక్రెయిన్‌ డ్రోన్‌లను ధ్వంసం చేశాం: రష్యా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సుమారు 251 ఉక్రెయిన్‌ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు చేపట్టిన తర్వాత కీవ్ చేపట్టిన అతిపెద్ద ప్రతీకార దాడుల్లో ఇది ఒకటి.

ఆదివారం రాత్రి సమయంలో వైమానిక రక్షణ హెచ్చరిక వ్యవస్థలు 251 ఉక్రెయిన్‌ ఫిక్స్‌డ్‌-వింగ్‌ మానవరహిత డ్రోన్‌లను అడ్డగించి, ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రిమియాపై 40 డ్రోన్‌లను, అలాగే నల్ల సముద్రంపై 62 డ్రోన్‌లను రష్యన్‌ దళాలు కూల్చివేశాయని పేర్కొంది. కుర్క్స్‌ మరియు బెల్గోరోడ్‌ ప్రాంతాలపై, అలాగే ఇతర ప్రాంతాలపై డజన్ల కొద్దీ డ్రోన్‌లను కూల్చివేసినట్లు వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -