Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదేండ్లలో జరగని అభివృద్ధి రెండేండ్లలో చేశాం 

పదేండ్లలో జరగని అభివృద్ధి రెండేండ్లలో చేశాం 

- Advertisement -

– అభివృద్ధి ఓర్వలేకే బి ఆర్ ఎస్ నాయకుల ఆరోపణలు 
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు , మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్

బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది ఏళ్లలో చేసిన అభివృద్ధి పనుల కంటే రెండేళ్లలో చేసి చూపించిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు , మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు హుస్నాబాద్ లో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టుకొని రైతులకు నీళ్లు అందిస్తుంటే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఎందుకు ఇయ్యలేదో  బి ఆర్ ఎస్ నాయకులు చెప్పాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తిచేసి నీళ్ళు అందిస్తానంటే అడ్డుకుంటుంది బి ఆర్ఎస్ నాయకులు కాదా అని ప్రశ్నించారు. మాటలు చెప్పడం కాదు అభివృద్ధి అంటే ఏందో కళ్ళకు కట్టినట్టు ఇవ్వాలా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కనబడుతుందన్నారు.

హుస్నాబాద్ బస్టాండ్ చూడండి అభివృద్ధి అంటే ఏందో కనబడుతుందన్నారు. హుస్నాబాద్ సర్కిల్ కూడలి, 250 పడకల ఆసుపత్రి, కొత్త పెళ్లి నుండి హుస్నాబాద్ వరకు ఫోర్ లైన్ రోడ్డు పనులు, ఇంజనీరింగ్ కాలేజ్ , ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీ కరణ, బతుకమ్మ ఘాటును చూడండన్నారు. గ్రామాలలో పట్టణాలలో వారి సొంత ఇంటి కల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈకార్యక్రమంలో హుస్నాబాద్ సర్పంచ్ ల పోరం అధ్యక్షులు పోలు సంపత్ ,మీర్జాపూర్ సర్పంచ్ వేల్పుల సంపత్, ఏఎంసి డైరెక్టర్ బాలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నరాజు ,రమేష్ నాయక్ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -